Tuesday, March 22, 2011






పచ్చగడ్డికి,ఎండుగడ్డికి...
రుచిలో..సుచిలో..పోలిక లేనప్పటికీ..
గడ్డి అనే ఆ వంటకంలో ఉన్నమధురం.మాటల్లో చెప్పలేనిదని.
మనుషులకుకూడా తెలుసు..
అప్పుడప్పుడు, నిత్యం..తింటారు కాబట్టి.






                                                               ----బండారు దానయ్యకవి.




నాకు,నామనసుకు మధ్య దూరముంది.
ఆ దూరం పగలుకు..పట్టపగలుకు ఉన్నంత దూరం.
నాకు,నాదేహానికి మధ్య దూరముంది.
ఆ దూరం రాత్రికి..నడిరాత్రికి ఉన్నంత దూరం.










                                                         ------బండారు దానయ్యకవి...








                                                           





మానం కన్నా ..ప్రాణం విలువైనది కాదని..
ఆంగ్లేయులు తెలుసుకుంది.
భారత స్త్రీలను చూసాక మాత్రమే.








                                    -----బండారు దానయ్యకవి.






మరుగుతుంది,మనుషుల నెత్తురు కాదు.
ఆదివారం వచ్చిందంటే..?
ఆ పొయ్యి మీద,ఈ పొయ్యిమీద..వాటి నెత్తురు కాకపోతే మననెత్తురా?






                                                         ----బండారు దానయ్యకవి. 






నాడు పాచికలేసింది ఒక్కడే.
నేడు పచికలేస్తుంది.
పదులా..
వందలా..
వేలా..లక్షలా..కోటానుకోట్లా..మిలియన్లా...............................
ఇన్నిపాచికలమధ్య రధసారధి లేని రాంబంటులు సామాన్యులు.




                                                          -----బండారు దానయ్యకవి.






పంచుకోడానికి ఏం మిగిలింది.?
పంచడానికి మాత్రం మిగిలింది.
డబ్బు మొహం.
రోగాల దేహం..




                                                -----బండారు దానయ్యకవి. 






మోహం అనే సముద్రంలో వేగంగా ఈదుతున్నాను.
లోతుకు వెళ్ళాను.
ఆ తెప్పతేలిపోయింది.
సముద్రమే ఎత్తి ఒడ్డునపడేసింది.
నాకు ఆందరూ కనబడుతున్నారు.
నేనే ఎవ్వరికీ కనబడుటలేదు.
ఏదో ఓ కార్యం జరుగుతుంది.
బహుశా అది నా సంతాప సభ కాబోలు.






                                                                ----బండారు దానయ్యకవి. 






సగటుమనిషి వెనకాల సైన్స్ పడలేదు.
సైన్స్ అడుగుజాడల్లో సగటుమనిషి నడవలేదు.
అనువైన సమయం సందర్భం అనుకున్నారేమో...
స్వమీజీలు పుట్టుకొచ్చారు.







                                                         -----బండారు దానయ్యకవి. 

prema










ప్రేమలేఖలెన్నో రాసా..
ఆ లేఖల్లోనాప్రేమంతా రాసా.
నీతిగా.. నిజాయితీగా.
ఐనా నాప్రేయసి మనసు కరగలేదు.
అన్నీజరిగిపోయాక..
అనుభవం పెరిగాక అప్పుడర్ధమైంది.
ఆ ప్రేమలేఖల్లో అబద్ధాలు రాయలేదని.
























                                                           ------బండారు దానయ్యకవి.













చెట్టు,పుట్ట..
రాయి,రప్ప..
భయం ఎరగవు.
బాధలూ ఎరగవు.
వాటికీ మనసులేకో..
మమతలు తెలియకో కాదు.
మహాజ్ఞానం వాటిసొంతం కాబట్టి.








                                           ------బండారు దానయ్యకవి.






తమ్ముడికి అన్న..
అన్నకు తమ్ముడు..
అక్కకు చిల్లి..
చెల్లికి అక్క..
ఈ అనుబంధాలన్నీ,ముందు ముందు...
జ్ఞాపకాలు మాత్రమే.
వయసొచ్చి ..ఓ ఇంటివారయ్యాక..
జీవితాలు వేరుకాబట్టి.







                                                     -----బండారు దానయ్యకవి.




అమ్మకోసం ఎన్నోసార్లు ఏడవాలనిపించింది.
ఏడ్చానుకూడా..
అమ్మప్రేమ కోసం ఎప్పుడూ ఎడవాలనిపించలేదు.
ఏడవలేదుకూడా..
అమ్మ అమ్మప్రేమ ఈ రెండూ వేరువేరుకాదు కాబోలు.







                                                      ------బండారు దానయ్యకవి.






కధలు ఎలాగైనా రాయొచ్చని... ద్రౌపది పాత్ర చెబుతుంటే.
కర్ణుడి పాత్ర పోటీపడుతుంది.






                                            -----బండారు దానయ్యకవి. 




లేడి వేటలో చాస్తుందో లేదో గానీ..
పులి మాత్రం వేటాడుతూనే చస్తుంది.




                         
                                                -----బండారు దానయ్యకవి.



తాళికడితే పెళ్ళని...
ఆ తాళిని తెంచేస్తే విడాకులని..
చెప్పిన పెద్దలు వెళ్ళిపోయారు.
ఆ మాటలను నమ్మిన వీళ్ళు అమలుచేస్తున్నారు.
నిజానిజాలు ..?మనుషులకు వదిలేసే కన్నా హృదయాలకు వదిలేస్తే..
మంచిది.






                                                              ----బండారు దానయ్యకవి. 






ఎన్ని యుగాలు అంతమైనా..
పేద యుగం అంతమవ్వదని..
చరిత్రలు చెబుతున్నాయి.







                                              -----బండారు దానయ్యకవి.



చేక్కిలిగిలి పెట్టినా..
చెవులు పిండినా..
కన్నీరే వస్తుంది ..
ప్రభుత్వాలు పథకాలు ప్రకటించినప్పుడు మాదిరి.
అదే..ప్రభుత్వాలు పన్నులు విధిస్తూ..ధరలను పెంచినప్పుడు మాదిరి.






                                           -----బండారు దానయ్యకవి.




ఎన్నో... గొప్పకట్టడాలను చూచి మురిసి పోతున్నాం.
ఎందుకు ఆ మురిపం.?
కట్టడాలను చూసా..?
కట్టడాలు వున్నఊర్లను..
కట్టించిన వాళ్ళ పేర్లను..చూసా.?
కూలీల ప్రాణాలు పునాదుల్లో..అవి ఎవ్వరికీ కనిపించవు కదా.!
బహుశా ఇందుకై వుంటుంది.





                                            -----బండారు దానయ్యకవి.




రాముడు,రాక్షసుడు..
పావనం,పైశాచికం..
స్వర్గం,నరకం..
మోక్షం,మరుజన్మ..
మనమధ్యేవున్న విభాగాలు.





                                                   -----బండారు దానయ్యకవి.

Monday, March 21, 2011







అధిక అల్ప సుఖాలకు కారణం..
అడ్డదిడ్డమైన సంపాదనే.







                                                  ----బండారు దానయ్యకవి.