పేగు బంధాలు
---------------------
---------------------
రోజూలాగే..ఆ రోజుకూడా సూర్యుడు వెళ్ళిపోయాడు.
చంద్రుడు వచ్చాడో,వస్తాడో...?
ఆ ధ్యాసేలేదు.
ధ్యాసంతా ఇంకా..ఇల్లు చేరని అమ్మ...నాన్నల మీదే.
అమ్మ...నాన్నల కోసం ఎదురు చూస్తూ..ఎదురు చూస్తూ...
ధ్యాసంతా ఇంకా..ఇల్లు చేరని అమ్మ...నాన్నల మీదే.
అమ్మ...నాన్నల కోసం ఎదురు చూస్తూ..ఎదురు చూస్తూ...
ఓ తమ్ముడు,ఓ చెల్లి,ఓ అన్న.
---------------------------------
---------------------------------
ఇరుగు పొరుగు ఇళ్ళలోనుండి వాకిళ్లలోకి విసురుగా వచ్చిపడుతూ..ఎగతాళి చేస్తున్న
ఎంగిలి కంచాల నీళ్లు.
కడుపులో ఆకలిలాగే కట్టలు తెంచుకుంటున్న కారుమబ్బు-
ఎంగిలి కంచాల నీళ్లు.
కడుపులో ఆకలిలాగే కట్టలు తెంచుకుంటున్న కారుమబ్బు-
హోరునా ఏడవడం మొదలుపెట్టింది.
అమ్మకొంగులాగా...
నాన్నపంచె లాగా...
చిల్లులుపడిన ఇంటిపైకప్పు.
ఇల్లు కారడం...
ఇల్లు కారడం...
తమ్ముడు,చెల్లి,ఓ మూలన చేరడం.
హెచ్చుతున్న...వానదేవుడి కోపం.
తగ్గుతున్నతాడువత్తి దీపం.
అమ్మ...నాన్నలే..ఎలా వస్తున్నారో పాపం.
-----------------------------------------------
తలుపు రంధ్రాల్లోనుండి తన్నుకోస్తున్నమెరుపులు, శాంతించని ఉరుముదేవుడి అరుపులు..
-----------------------------------------------
తలుపు రంధ్రాల్లోనుండి తన్నుకోస్తున్నమెరుపులు, శాంతించని ఉరుముదేవుడి అరుపులు..
అ మెరుపులకు...ఆ అరుపులకు...
పోటీపడుతున్నపెనుగాలి.
ఆ సమయంలో ఆ పసిమనసులను పలకరిస్తున్నది-
ప్రళయాన్నితలపిస్తున్నఆ ప్రకృతి...
--------------------------------------
అంత అలజడిలోకుడా ..!
పోటీపడుతున్నపెనుగాలి.
ఆ సమయంలో ఆ పసిమనసులను పలకరిస్తున్నది-
ప్రళయాన్నితలపిస్తున్నఆ ప్రకృతి...
--------------------------------------
అంత అలజడిలోకుడా ..!
అలవాటు పడిన ఆ చెవులకు మాత్రమే..వినిపిస్తుంది,ఏదోశభ్ధం.
ఆశ...ఆనందగామారి ఆనందం...ధైర్యంతోచేరి-
పందిట్లోకివచ్చి చూడగా...!
పందిట్లోకివచ్చి చూడగా...!
అంతపెద్ద హోరు వానను కూడా లెక్కచేయక ఒకే ఒక్క ఆరాటంతో అడుగులు వేస్తూ వస్తున్నది..! ఆ..అమ్మ...నాన్నలే...
వాళ్లు మోసుకొస్తున్న ఆ కొంగు మూటలను చూస్తే..?
------------------------------------------------------------
------------------------------------------------------------
పిల్లపక్షులకు ఆహారాన్నినోట్లో దాచితెచ్చే...తల్లి పక్షులు కూడా...
ఈ తల్లిదండ్రుల ముందు వెలవెల పోవాల్సిందే.
-------------------------------------------------------------------------------
ఈ తల్లిదండ్రుల ముందు వెలవెల పోవాల్సిందే.
-------------------------------------------------------------------------------
అయ్యా...అయ్యా...అంటూ ఆ అమ్మ...నాన్నలు సమీపిస్తున్నారు,
అన్నా...అన్నా...అంటూ ఆ తమ్ముడూ చెల్లి సందేహిస్తున్నారు.
ఆ అమ్మ...నాన్నలకు అయ్యను నేనే.
ఆ తమ్ముడు చెల్లికి అన్ననూ...నేనే,నేనే..
----------------------------------------
----------------------------------------
ఆ బిడ్డలు...ఆ తల్లిదండ్రులు తడిసిముద్దైన...ఆ క్షణం,
----------------------------------------
----------------------------------------
కన్నవాళ్ల కడుపు ఆకలికి...!
కడుపున పుట్టిన బిడ్డల బొడ్డు కేకలకి...!
సాక్షిగా నిలిచింది...ఆ క్షణం.
------------------------
అచ్చోట అచ్చోట...మమకారం అనే పదం మళ్లీ జన్మించింది.
అప్పటిదాకా ప్రళయాన్నిమరిపించిన ప్రకృతి...
ఆ బంధాన్నిచూసి..
కడుపున పుట్టిన బిడ్డల బొడ్డు కేకలకి...!
సాక్షిగా నిలిచింది...ఆ క్షణం.
------------------------
అచ్చోట అచ్చోట...మమకారం అనే పదం మళ్లీ జన్మించింది.
అప్పటిదాకా ప్రళయాన్నిమరిపించిన ప్రకృతి...
ఆ బంధాన్నిచూసి..
శాంతించడమే కాదు సహకరించింది కూడా.
ఆ రోజు మా అందరినీ తడిపేసిన ఆ రాత్రి...
ఈ రోజు ఈ రాత్రి ఇలా...నా కళ్ళముందు కదలాడగా...!
------------------------------------------------------------
------------------------------------------------------------
ఆ తడికి పొడిబారిన నా స్వరపేటిక,చూపు మందగించిన నా కళ్ళు,
బరువెక్కిన నా గుండె...
ఎలా...? కుదుటపడేది..!
అమ్మతో పంచుకోవాలా...
అమ్మ ఎప్పుడో వెళ్ళిపోయింది.
----------------------------
----------------------------
నాన్నతో పంచుకోవాలా...
ఆ జ్ఞాపకాల్లోకి నాన్నను నేట్టేయడం నాకిష్టంలేదు.
తమ్ముడు,చెల్లి...?
వాళ్లకు అంతగా గుర్తులేని ఆ విషయాన్ని...
గుర్తుచేయడం ఎందుకు..?
......................
......................
నా భార్యాపిల్లలతో పంచుకుందామంటే ..
నన్నుతప్పా...
నా బాల్యాన్నివాళ్లకు పరిచయం చేయడం....? హాయిగా నిద్రపోతన్న- వాళ్లను...!
నిద్రలేపి మరీ...ఆ...హా,,,
.......................................
మరి...హితులు...!
మరి...హితులు...!
ఈ రాత్రి సమయంలో హితులనెలా ఇబ్బంది పెట్టడం...?
------------------------------------------------------------------------------
ఉక్కిరి బిక్కిరిగా...
దిక్కులు చూస్తున్ననన్ను...
ఎవరోఒకరు గమనిస్తున్నారని నామనసు నాకు చెబుతుండగా-
-----------------------------------------------------------------
-----------------------------------------------------------------
అలా తలెత్తి చూసా..!
మెడలో దండతోపాటు గోడకు వేలాడుతున్నఅమ్మ...
అమ్మ
నన్నే చూస్తుంది,
అమ్మ
నన్నే చూస్తుంది,
ఎంతసేపటి నుండి చూస్తుందో ఏమో..!
-------------------------------------------
-------------------------------------------
అంతే...గుండెల్లో భారమంతా కళ్ళల్లోనుంచి ధారలుగా కారడం,
చేతిలోని కలంతో పాటు కాగితాలనూ తడపడం,
అలా తడిపేస్తుంటే...?
అలా తడిపేస్తుంటే...?
తరించడం గాకా మరేంటీ ?
అదే తడి అదే తడి.
ఆ నాటి ఆ తడి
ఈ నాటికీ తడిగానే ఉందీ అంటే..
పేగు బంధాలలో ఉండే ప్రేమబంధం ఎంత గొప్పదో కదా ..!
అనిర్వచనీయమైన ఆ అనుభూతిని అనునిత్యము ఆరగిస్తున్న-
నేను మాత్రం అదృష్టవంతున్ని.
ఆ అదృష్టాన్నినాకిచ్చిన నా కుటుంబానికి
మరుజన్మలోకుడా బంధీనై ఉంటాను,బానిసనై ఉంటాను.
నేను మాత్రం అదృష్టవంతున్ని.
ఆ అదృష్టాన్నినాకిచ్చిన నా కుటుంబానికి
మరుజన్మలోకుడా బంధీనై ఉంటాను,బానిసనై ఉంటాను.
---- బండారు దానయ్య కవి.
No comments:
Post a Comment